Indian Hindu Devotional Song Lyrics including Vishnu,Ram, Durga, Ganesha, Lakshmi, Shiva, Krishna, ...
GODDESS LALITHA
న్యాసమ్:
ఓం అస్యశ్రీ లలితాదివ్య సహస్ర నామస్తోత్ర మహామంత్రస్య,
వశిన్యాది వాగ్దేవతా ఋషయః, అనుష్టప్ఛన్దః,
శ్రీలలితా పరా భట్టారికా మహా త్రిపురసుందరీ దేవతా,
ఐం-బీజం, క్లీం శక్తిః - సౌః కీలకం,
మమ చతుర్విథ ఫలపురుషార్థ సిద్ధ్యర్థే జపేవినియోగః||
ధ్యానమ్:
సింధూరారుణ విగ్రహాం, త్రినయనాం మాణిక్య మౌలిస్ఫుర,
త్తారా నాయక శేఖరాం, స్మితముఖీ మాపీన వక్షోరుహమ్!
పాణిభ్యామళిపూర్ణరత్న, చషకం రక్తోత్పలం బిభ్రతీం,
సౌమ్యాం రత్నఘటస్థరక్త, చరణాం ధ్యాయేత్పరాంమ్బికాం!!
అరుణాం కరుణాతరంగితాక్షీం, దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్|
అణిమాదిభిరావృతాం మయూఖై, రహమిత్యేవ విభావయే భావానీమ్||
ధ్యాయేత్ పద్మాసనస్థాం, వికసితవదనాం, పద్మపత్రాయతాక్షీం|
హేమాభాం పీతవస్త్రాంకరకలిత, లసద్ధేమ పద్మాం వరాంగీమ్||
సర్వాలంకారయుక్తాం, సకల మభయదాం, భక్తనమ్రాం భవానీం|
శ్రీవిద్యాం శాన్తమూర్తిం, సకల సురనుతాం సర్వ సంపత్ప్ర దాత్రీమ్||
సకుంకుమ విలేపనా, మళికచుమ్బి కస్తూరికాం|
సమన్దరహసితేక్షణాం, సశరచాప పాశాంకుశాం||
అశేషజనమోహినీ, మరుణ మాల్య భూంషోజ్జ్వలాం|
జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేద్దమ్బికామ్||
శ్రీలలితా సహస్రనామ స్తోత్ర ప్రారంబః
ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః
శ్రీమాతా శ్రీ మహారాజ్ఞీ, శ్రీమత్సింహాసనేశ్వరీ||
చిదగ్నికుండసమ్భూతా, దేవకార్యసముద్యతా.||1||
ఉద్యద్భాను సహస్రాభా, చతుర్బాహుసమన్వితా||
రాగస్వరూపపాశాఢ్యా, క్రోధాకారాంకుశోజ్జ్వలా.||2||
మనోరూపేక్షు కోదండా, పంచ తన్మాత్ర సాయకా||
నిజారుణ ప్రభాపూర, మజ్జ ద్బ్రహ్మాండమండలా. ||3||
చంప కాశోక పున్నాగ, సౌగంధిక లసత్కచా||
కురువింద మణిశ్రేణీ, కనత్కోటీర మండితా.||4||
అష్టమీ చంద్ర విభ్రాజ దిళికస్థల శోభితా||
ముఖచంద్ర కళంకాభ మృగనాభి విశేషకా.||5||
వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లికా||
వక్ర్త లక్ష్మీ పరీవాహ చలన్మీనాభ లోచనా.||6||
నవ చంపక పుష్పాభ నాసా దండ విరాజితా||
తారా కాంతి తిరస్కారి నాసాభరణ భూషితా.||7||
కదంబ మంజరీక్లుప్త కర్ణపూర మనోహర||
తాటంక యుగలీ భూత తపనోడుప మండలా.||8||
పద్మరాగ శిలాదర్శ పరిభావిక పోలభుః ||
నవ విద్రుమ బింబశ్రీ న్యక్కారి రదనచ్ఛదా ||9||
శుద్ధ విద్యంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్జ్వలా ||
కర్పూర వీటికామోద సమాకర్ష ద్దిగంతరా ||10||
నిజసల్లాప మాధుర్య వినిర్భర్సిత కచ్ఛపీ ||
మందస్మిత ప్రభాపూర మజ్జ త్కామేశ మానసా||11||
అనాకలిత సాదృశ్య చుబుకశ్రీ విరాజితా ||
కామేశబద్ధ మాంగల్య సూత్ర శోభిత కంధరా ||12||
కనకాంగద కేయూర కమనీయ భుజాన్వితా ||
రత్నగ్రైవేయ చింతాకలోల ముక్తా ఫలాన్వితా ||13||
కామేశ్వర ప్రేమరత్న మణి ప్రతిపణ స్తనీ ||
నాభ్యాలవాల రోమాళీ లతాఫల కుచద్వయీ ||14||
లక్ష్యరోమ లతాధారా తాసమున్నేయ మాధ్యమా||
స్తనభార దళన్మధ్య పట్టబంధ వళిత్రయ ||15||
అరుణారుణ కౌసంభ వస్త్ర భాస్వ త్కటీతటీ ||
రత్న కింకిణికారమ్య రశనా దామ భూషితా ||16||
కామేశ జ్ఞాత సౌభాగ్య మార్దవోరు ద్వయాన్వితా ||
మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితా ||17||
ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూణా భజంఘికా ||
గూఢగుల్ఫా కూర్మపృష్ఠ జయిష్ణు ప్రపదాన్వితా ||18||
నఖధీధితి సంఛన్న నమజ్జన తమోగుణా ||
పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహా ||19||
శింజాన మణి మంజీర మండిత శ్రీపదాంబుజా ||
మరాళీ మందగమనా మహాలావణ్య శేవధిః ||20||
సర్వారుణా నవద్యాంగీ సర్వాభరణ భూషితా |
శివ కామేశ్వరాంకస్థా శివా స్వాధీన వల్లభా ||21||
సుమేరుశృంగ మధ్యస్థా శ్రీమన్నగర నాయికా |
చింతామణి గృహాంతస్థా పంచబ్రహ్మాసన స్థితా ||22||
మహాపద్మాటవీ సంస్థా కదంబ వనవాసినీ |
సుధాసాగర మధ్యస్థా కామాక్షీ కామదాయినీ ||23||
దేవర్షిగణ సంఘాత స్తూయమానాత్మ వైభవా ||
భండాసుర వధోద్యుక్త శక్తి సేనా సమన్వితా ||24||
సంపత్కరీ సమారూఢ సింధురవ్రజ సేవితా ||
అశ్వారూఢాధిష్ఠితాశ్వ కోటి కోటిభిరావృతా ||25||
చక్రరాజ రథారూఢ సర్వయుధ పరిష్కృతా ||
గేయచక్రరథారూఢ మంత్రిణీ పరి సేవితా ||26||
కిరిచక్ర రథారూఢ దండనాథ పురస్క్రుతా ||
జ్వాలా మాలినికాక్షిప్తవహ్ని ప్రాకార మధ్యగా ||27||
భండసైన్య వధోద్యుక్త శక్తివిక్రమ హర్షితా ||
నిత్యాపరాక్రమాటోప నిరీక్షణ సముత్సుకా ||28||
భండపుత్ర వధోద్యుక్త బాలావిక్రమ నందితా ||
మంత్రిణ్యంబా విరచిత విషంగవధ తోషితా ||29||
విశుక్రప్రాణ హరణ వారాహీ వీర్యనందితా ||
కామేశ్వర ముఖాలోక కలిప్త శ్రీగణే శ్వరా ||30||
మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షితా ||
భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణీ ||31||
కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతిః ||
మహా పాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనికా ||32||
కామేశ్వరాస్ర నిర్దగ్ధ సభండాసుర శూన్యకా |
బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవసంస్తుత వైభవా ||33||
హర నేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవ నౌషధిః |
శ్రీమద్వాగభవ కూటైక స్వరూప ముఖపంకజా ||34||
కంఠాధః కటిపర్యంత మధ్యకూట స్వరూపిణీ |
శక్తికూటైక తాపాన్న కట్యధోభాగ ధారిణీ ||35||
మూలమంత్రాత్మికా మూలకూటత్రయ కళేబరా |
కుళామృతైక రసికా కుళసంకేత పాలినీ ||36||
కుళాంగనా కుళాంతస్థా కౌళినీ కులయోగినీ |
అకుళా సమయాంతస్థా సమయాచార తత్పరా ||37||
మూలాధారైక నిలయా బ్రహ్మ గ్రంథివిభేదినీ |
మణిపూరాంత రుదితా విష్ణుగ్రంథి విభేదినీ ||38||
ఆజ్ఞాచక్రాంతరాళస్థా రుద్రగ్రంథి విభేదినీ |
సహస్రారాంబుజారూఢా సుధాసారాభి వర్షిణీ ||39||
తటిల్లతా సమరుచి ష్షట్చక్రోపరి సంస్థితా |
మహాశక్తిః కుండలినీ బిసతంతు తనీయసీ ||40||
భవనీ భావనాగమ్యా భావారణ్య కుఠారికా |
భద్రప్రియా భద్రమూర్తి ర్భక్త సౌభాగ్యదాయినీ ||41||
భక్తిప్రియా భక్తిగమ్యా భక్తి వశ్యా భయాపహా |
శాంభవీ శారదారాధ్యా శర్వాణీ శర్మదాయినీ ||42||
శాంభవీ శారదారాధ్యా శర్వాణీ శర్మదాయినీ |
శాంకరీ శ్రీకరీ సాధ్వీ శరచ్చంద్ర నిభాననా ||43||
నిర్లేపా నిర్మలా నిత్యా నిరాకారా నిరాకులా |
నిర్గుణా నిష్కళా శాంతా నిష్కామా నిరుపప్లవా ||44||
నిత్యముక్తా నిర్వికారా నిష్ప్రపంచా నిరాశ్రయా |
నిత్యశుద్ధా నిత్యబుద్ధా నిరవద్యా నిరంతరా ||45||
నిష్కారణా నిష్కళంకా నిరుపాధి ర్నిరీశ్వరా |
నీరాగా రాగమథనా నిర్మదా మదనాశినీ ||46||
నిశ్చింతా నిరహంకారా నిర్మోహా మోహనాశినీ |
నిర్మమా మమతా హంత్రీ నిష్పాపా పాపనాశినీ ||47||
నిష్క్రోధా క్రోధశమనీ నిర్లోభా లొభనాశినీ |
నిస్సంశయా సంశయఘ్నీ నిర్భవా భవనాశినీ ||48||
నిర్వికల్పా నిరాబాధా నిర్భేదా భేదనాశినీ |
నిర్నాశా మృత్యుమథనీ నిష్క్రియా నిష్పరిగ్రహా ||49||
నిస్తులా నీలచికురా నిరపాయా నిరత్యయా |
దుర్లభా దుర్గమా దుర్గా దుఃఖహంత్రీ సుఖప్రదా ||50||
దుష్టదూరా దురాచార శమనీ దోషవర్జితా |
సర్వజ్ఞా సాంద్రకరుణా సమానాధిక వర్జితా ||51||
శ్రీ లలితా శివ జ్యోతి హారతి
శ్రీ లలితా శివ జ్యోతి సర్వ కామదా,
శ్రీ గిరి నిలయా గిరామయ సర్వ మంగళా.
శ్రీ లలితా శివ జ్యోతి సర్వ కామదా.
జగముల చిరు నగముల పరిపాలించే జననీ,
అనయము మము కనికరమున కాపాడే జననీ,
మనసే నీ వసమై, స్మరణే జీవనమై,
మాయని వరమీయవె పరమేశ్వరి మంగళ హారతి. ||1||
శ్రీ లలితా శివ జ్యోతి సర్వ కామదా,
శ్రీ గిరి నిలయా గిరామయ సర్వ మంగళా.
శ్రీ లలితా శివ జ్యోతి సర్వ కామదా.
అందరికన్నా చక్కని తల్లికి --- సూర్యహారతి,
అందలేలే చల్లని తల్లికి --- చంద్రహారతి,
రవ్వల తళుకుల కలలా జ్యోతుల --- కర్పూరహారతి,
సకల నిగమ వినుత చరణ --- శాశ్వత మంగళ హారతి. ||2||
శ్రీ లలితా శివ జ్యోతి సర్వ కామదా,
శ్రీ గిరి నిలయా గిరామయ సర్వ మంగళా.
శ్రీ లలితా శివ జ్యోతి సర్వ కామద.
Subscribe to:
Posts (Atom)