Lord Vinayaka Songs With Lyrics


విఘ్నేశ్వర చవితి పద్యములు

ప్రార్థన :

తొండము నేకదంతమును తోరపు బొజ్జయు వామహస్తమున్‌ 
మెండుగ మ్రోయు గజ్జెలును మెల్లని చూపుల మందహాసమున్‌. 
కొండొక గుజ్జురూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జయై 
యుండెడి పార్వతీ తనయ ఓయి గణాధిపా నీకు మ్రొక్కెదన్‌.

తలచెదనే గణనాథుని 
తలచెదనే విఘ్నపతిని దలచినపనిగా 
దలచెదనే హేరంబుని 
దలచెద నా విఘ్నములను తొలగుట కొరకున్‌ 

అటుకులు కొబ్బరి పలుకులు 
చిటిబెల్లము నానుబ్రాలు చెరకురసంబున్‌ 
నిటలాక్షు నగ్రసుతునకు 
బటుతరముగ విందుచేసి ప్రార్థింతు మదిన్‌.  

గణేశాష్టకం


యతో నంతశక్తే రనంతాశ్చ జీవా 
యతో నిర్గుణా దప్రమేయా గుణాస్తే 
యతో భాతిసర్వం త్రిధా బేధ భిన్నం 
సదా తం గణేశం నమామో భజామః. 1 
యతాశ్చావిరాసీజ్జహత్సర్వమే తత్తథా – 
బ్జాసనో విశ్వగో విశ్వగోప్తా 
తథేంద్రాదయో దేవసంఘా మనుష్యాః 
సహ్డా తం గణేశ నమామో భజామః. // 2 
యతో వహ్నిభానూ భవో భూర్జలం చ 
యతః సాగరాశ్చంద్రమా వ్యోమ వాయుః // 
యతః స్థావరా జంగమావృక్ష సంఘాః 
సదా తం గణేశం నమామో భజామః // 3 
యతో దానవాః కిన్నరా యక్ష సంఘా 
యతాశ్చారణ వారణాః శ్వాపదాశ్చ // 
యతః పక్షికీటా యతో వీరుధశ్చ 
సదా తం గణేశం నమామో భజామః // 4 
యతో బుద్ధిరజ్ఞాననాశో ముముక్షోర్యతః 
సంపదో భక్త సంతోషికాః స్యుః // 
యతో విఘ్ననాశో యతః కార్యసిద్ధిః 
సదా తం గణేశం నమామో భజామః // 5 
యతః పుత్రసంపద్యతో వాంచితార్థో 
యతో భక్త విఘ్నాస్తథా నేకరూపాః // 
యతః శోకమోహౌ యతః కామ ఏవ 
సదా తం గణేశం నమామో భజామః // 6 
యతో నంతశక్తి స్స శేషో బభూవ 
ధరాధరణే నేకరూపే చ శక్తః 
యతో నేకధా స్వర్గలోకా హి నానా 
సదా తం గణేశం నమామో భజామః // 7 
యేత వేద వాచో వికుంఠా మనోభిః 
సదా నేతి నేతీతి యత్తాగృణంతి // 
పరబ్రహ్మరూపం చిదానంద భూతం 
సదా తం గణేశం నమామో భజామః // 8 
శ్రీ గణేశ ఉవాచ : 
పునరూచే గణాధిశః స్తోత్రమేతత్ప ఠేన్నరః / 
త్రిసంధ్యం త్రిదినం తస్య సర్వకార్యం భవిష్యతి / 
యో జపే ద్యష్టదివసం శ్లోకాష్టకమిదం శుభమ్ / 
అష్టవారం చతుర్ధ్యాం తుసో ష్టసిద్ధి రవాప్నుయాత్ / 
యః పఠేన్మాస మాత్రం తు దశవారం దినేదినే / 
స మోచ యే ద్బంధగతం రాజవధ్యం న సంశయః / 
విద్యాకామో లభేద్విద్యామ్ పుత్రార్థీపుత్ర మాప్నుయాత్ / 
వాంఛితాల్లభతే సర్వానేక వింశతి వారతః / 
యో జపేత్పరయా భక్త్యా గజానన పరో నరః / 
ఏవముక్త్వా తతో దేవశ్చాంతర్ధానం గతః ప్రభుః /

ఇతి శ్రీ గణేశ పురాణే ఉపాసనా శ్రీ గణేశాష్టకం సంపూర్ణమ్.


సంకటనాశన గణేశస్తోత్రమ్

నారదౌవాచ :

ప్రణమ్య శిరసా దేవం , గౌరీపుత్రం వినాయకమ్,
భక్తావాసం స్మరేన్నిత్యం, ఆయుఃకామార్థసిద్ధయే. 

ప్రథమం వక్రతుండం చ, ఏకదంతం ద్వితీయకమ్, 
తృతీయం కృష్ణపింగాక్షం, గజవక్త్రం చతుర్థకమ్. 

లంబోదరం పంచమం చ, షష్ఠం వికటమేవ చ, 
సప్తమం విఘ్నరాజం చ, ధూమ్రవర్ణం తథాష్టమమ్. 

నవమం ఫాలచంద్రం చ, దశమం తు వినాయకమ్, 
ఏకాదశం గణపతిం, ద్వాదశం తు గజాననమ్. 

ద్వాదశ ఈతాని నామాని, త్రిసంధ్యం యః పఠేన్నరః, 
న చ విఘ్నభయం తస్య, సర్వసిద్ధికారకం ప్రభో ! 

విద్యార్థీ లభతే విద్యాం, దనార్థీ లభతే ధనమ్, 
పుత్రార్థీ లభతే పుత్రాన్, మోక్షార్థీ లభతే గతిమ్. 

జపేత్ గణపతిస్తోత్రం, షడ్భిర్మాసైః ఫలం లభేత్, 
సంవత్సరేణ సిద్ధిం చ, లభతే నాత్ర సంశయః. 

అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ, లిఖిత్వా యః సమర్పయేత్, 
తస్య విద్యా భవేత్ సర్వా, గణేశస్య ప్రసాదతః . 

ఇతి శ్రీ నారదపురాణే సంకటనాశన గణేశస్తోత్రం సంపూర్ణమ్.


పంచరత్న స్తోత్రము

ఇక్కడికి గెంతు: పేజీకి సంబంధించిన లింకులు, అన్వేషణ ఆదిశంకరాచార్యులు విరచించిన శ్రీ గణేశ పంచరత్న స్తోత్రం

ముదాకరాత్తమోదకం సదావిముక్తి సాధకం
కళాధరావతంసకం విలాసిలోక రక్షకం
అనాయకైక నాయకం వినాశితేభ దైత్యకం
నతాశుభాశు నాశకం నమామి తం వినాయకం || 1 ||

నతేరాతి భీకరం నవోదితార్క భాస్వరం
నమత్సురారి నిర్జరం నతాధికాప దుద్ధరం
సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం
మహేశ్వరం తమాశ్రయే పరాత్పరం నిరంతరం || 2 ||

సమస్తలోక శంకరం నిరస్త దైత్యకుంజరం
దరేతరోదరం వరం వరేభవక్త్ర మక్షరం
కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం
మనస్కరం నమస్కృతం నమస్కరోమి భాస్వరం || 3 ||

అకించనార్తి మార్జనం చిరంతనోక్తి భాజనం
పురారి పూర్వ నందనం సురారి గర్వచర్వణం
ప్రపంచ నాశభీషణం ధనంజయాది భూషణం
కపోలదానవారణం భజే పురాణ వారణం || 4 ||

నితాంతకాంతదంతకాంతిమంతకాంతకాత్మజం
అచింత్యరూప మంతహీనమంతరాయ కృంతనం
హృదంతరే నిరంతరం వసంతమేవ యోగినాం
తమేకదంతమేవ తం విచింతయామి సంతతం || 5 ||

ఫలశ్రుతి:

మహాగణేశ పంచరత్నమాదరేణ యోన్వహం

ప్రజల్పతి ప్రభాతకే హృదిస్మరన్ గణేశరమ్

అరోగతాం అదోషతాం సుసాహితీం సుపుత్రతాం

సమాహితాయురష్టభూతిమభ్యుపైతి సోచిరాత్

ఇతి శ్రీ శంకరాచార్య విరచితం గణేశ పంచరత్నం సంపూర్ణం. 

వినాయక మంగళాచరణము

 ఓ బొజ్జగణపయ్య నీ బంటు నేనయ్య ఉండ్రాళ్ళ మీదికి దండు పంపు
కమ్మనినేయుయు కడుముద్దపప్పును బొజ్జవిరగ గదినుచు పొరలుకొనుచు - జయమంగళం నిత్య శుభమంగళం

వెండి పళ్ళెములో వేయివేల ముత్యాలు కొండలుగ నీలములు కలయబోసి
మెండుగను హారములు మెడనిండ వేసుకొని దండిగా నీకిత్తుఘనహారతి - జయమంగళం నిత్య శుభమంగళం

శ్రీ మూర్తి వ్యందునకు చిన్మయానందునకు భాసురోతునకు శాశతునకు
సోమార్కనేత్రునకు సుందరాకారునకు కామరూపునకు శ్రీగణనాథునకు - జయమంగళం నిత్య శుభమంగళం

ఏకదంతమును ఎల్లగజవదనంబు బాగైన తొండంబు కడుపుగలుగు
బోడైన మూషికము సొరదినెక్కాడుచు భవ్యముగ దేవగణపతికినిపుడు - జయమంగళం నిత్య శుభమంగళం

చెంగల్వ చామంతి చెలరేగి గన్నేరు తామర తంగేడు తరచుగాను
పుష్పజాతూ దెచ్చి పూజింతు నేనిపుడు బహుబుద్ధీ గణపతికి బాగుగాను - జయమంగళం నిత్య శుభమంగళం