sai baba


శ్రీ సాయిబాబా అష్టకం



 పత్రిగ్రామ సమద్భూతం ద్వారకామాయి వాసినం
భక్తాభీష్టప్రదం దేవం సాయినాథం నమామ్యహం 1

మహోన్నత కులేజాతం క్షీరాంబుధి సమే శుభే
ద్విజరాజం తమోఘ్నంతం సాయినాథం నమామ్యహం 2

జగదుద్ధారణార్ధం యో నరరూపధరో విభుః
యోగినంచ మహాత్మానాం సాయినాథం నమామితం 3

సాక్షాత్‌ కారం జయోలాభే స్వాత్మారామో గురోర్‌ ముఖాత్‌
నిర్మలం మమతాఘ్నంతం సాయినాథం నమామ్యహం 4

యస్య తర్శన మాత్రేణ పశ్యంతి వ్యాధికోటయః
సర్వేపాపాః ప్రాణశ్యంతి సాయినాథం నమామితం 5

నరసింహాది శిష్యాణాం దదౌయోనుగ్రహం గురుః
భవబంధాన హర్తారం సాయినాధం నమామితాం 6

ధనహీన చ దారిద్రాన్య, సమదృష్టైవ పశ్యతి
కరుణసాగరం దేవం సాయినాథం నమామితం 7

సమాధిసాపి యో భక్తా సమతీష్టార్థ దానతః
అచింతం మహిమానంతం సాయినాథం నమామ్యహం 8

 సాయి  చాలిసా

షిరిడి  వాస  సాయి  ప్రభో - జగతికి  మూలం  నీవే  ప్రభో 
దత్త  దిగంబర  అవతారం - నీలో  సృష్టి  వ్యవహారం
త్రిమూర్తి  రూప ఓ   సాయి - కరుణించి కాపాడాయి
దర్సన  మీయగ  రావయ్యా - ముఖ్తి  కి  మార్గం  చుపుమయ 

షిరిడి వాస  సాయి  ప్రభో - జగతికి  మూలం  నీవే  ప్రభో 

కాఫీని   వస్త్రం  దరిఇంచి - భుజముకు  జోలి  తగిలించి
నింబ  వృక్షపు చాయలో  - పకీరు వేశపు  ధారణ లో 
కలియుగమందున  వెలసితివి - త్యాగం  సహనం  నేరపితివి
శిరిగి  గ్రామం  నే  వాసం - భక్తియా  మదిలో  ని  రూపం 
                                                                      
షిరిడి  వాస  సాయి  ప్రభో  - జగతికి  మూలం  నీవే  ప్రభో  

చాంద్  పాటిల్ను  కలుసుకుని  - అతని  బాధలు  తెలుసుకుని  
గుర్రం  జాడ  తెలిపితివి  - పాటిల్  బాధను  తీర్చితివి  
వెలిగించావు  జ్యోతులను  - ని  ఉపయోగించే  జలము  
అచ్చేరువొండెను  ఆ  గ్రామం  - చూసి  వింతైన  ఆ  దృశ్యం  

షిరిడి  వాస  సాయి  ప్రభో  - జగతికి  మూలం  నీవే  ప్రభో  

బాయిజ  చేసెను  ని  సేవ  - ప్రతిఫల  మిచ్చవో  దేవ  
ని  ఆయువును  బదులిచ్చి  - తాత్యను  నీవు  బ్రతికించి   
పసుపక్షులను  ప్రేమించి  - ప్రేమతో  వాటిని  లాలించి  
జీవుల  పైన  మమకారం  - చిత్రమయ  నీ  వ్యవహారం  

షిరిడి  వాస  సాయి  ప్రభో  - జగతికి  మూలం  నీవే  ప్రభో  

నీ  ద్వారములో  నిలిచితిని  - నిన్నే  నిత్యమూ  కొలిచితిని  
అభయము  నిచి  బ్రోవుమయ   - ఓ  శిరిదిస  దయామయ  
ధన్యము  ద్వారకా  ఓ  మాయి   - నీలో  నిలిచెను  శ్రీ  సాయి  
నీ  ధుని  మంటల  వేడిమి  కి  - పాపము  పోవును  తాకిడి  కి   

షిరిడి  వాస  సాయి  ప్రభో  - జగతికి  మూలం  నీవే  ప్రభో  

ప్రళయ  కాలము  ఆపితివి  - భక్తులను  నీవు  బ్రోచితివి  
చేసి  మహమ్మారి  నాసం  - కాపాడే  షిరిడి  గ్రామం  
అగ్ని  హోత్రి  శాస్త్రి  కి  - లీల  మహత్యం  చూపించి  
శ్యామాను  బ్రతికించితివి  - పాము  విషము  తొలగించిటివి  

షిరిడి  వాస  సాయి  ప్రభో  - జగతికి  మూలం  నీవే  ప్రభో  

భక్త  బిమాజి  కి  క్షయ  రోగం  - నసియించే  అతనీ  సహనం  
ఊదీ  వైద్యం  చేసావు  - వ్యాధిని  మాయం  చేసావు  
కాకాజీ  కి  ఓ  సాయి  - విట్టాల  దర్సన  మిచ్చితివి  
దాము  కిచ్చి  సంతానం  - కలిగించిటివి  సంతోషం  

షిరిడి  వాస  సాయి  ప్రభో  - జగతికి  మూలం  నీవే  ప్రభో  

కరుణ  సింధు  కరుణించు  - మా  పై  కరుణ  కురిపించు  
సర్వం  నికే  అర్పితము  - పెంచుము  భక్తి  భావమును  
ముస్లిం  అనుకునే  నిను  మేఘ  - తెలుసుకునే  అతనీ  బాధ  
దాల్చి  శివ  సంకర  రూపం  - ఇచ్చ్వయ్య  దర్శనము  

షిరిడి  వాస  సాయి  ప్రభో  - జగతికి  మూలం  నీవే  ప్రభో  

డాక్టర్  కు  నీవు  రాముని  గ  - బల్వంతుకు  శ్రీ  దత్తుని  గ  
నిమోనుకరకు  మారుతి  గ  - చిడంబరకు  శ్రీ  గణపతి  గ  
మార్తందుకు  ఖండోబా  గ  - ఘను  కి  సత్య  దేవుని  గ  
నరసింహ  స్వామి  గ  జోషి  కి  - దర్సనం  ఇచ్చిన  శ్రీ  సాయి  

షిరిడి  వాస  సాయి  ప్రభో  - జగతికి  మూలం  నీవే  ప్రభో  

రేయి  పగలు  నీ  ద్యనం  - నిత్యం  నీ  లీల  పటనం  
భక్తి  తో  చేయండి  ద్యనం  - లభించును  ముఖ్తి  కి  మార్గం  
పదకొండు  నీ  వచనాలు  - బాబా  మాకవి  వీదాలు     
సర్నని  వచ్చిన  భక్తులను  - కరుణించి  నీవు  బ్రోచితివి  

షిరిడి  వాస  సాయి  ప్రభో  - జగతికి  మూలం  నీవే  ప్రభో  

అందరి  లోన  నీ  రూపం  - నీ  మహిమ  అథి  శక్తి  మాయం  
ఓ  సాయి  మేము  మూడులము  - ఒసగుమయ  నీవు  జ్ఞానమును  
సృష్టికి  నీవే  నయ  మూలం  - సాయి  మేము  సేవకులం  
సాయి  నామము  తలచేదము  - నిత్యం  సాయి  ని  కొలిచెదము  

షిరిడి  వాస  సాయి  ప్రభో  - జగతికి  మూలం  నీవే  ప్రభో  

భక్తి  భావన  తెలుసుకుని  - సాయి  ని  మదిలో  నిలుపుకుని  
చిత్తము  తో  సాయి  ధ్యానం  - చెయ్యండి  ప్రతి  నిత్యం  
బాబా  కాల్చిన  ధుని  వుడి  - నివారించును  అది  వ్యాధి  
సమాధి  నుండి  శ్రీ  సాయి  - భక్తులను  కపదెనొఇ  

షిరిడి  వాస  సాయి  ప్రభో  - జగతికి  మూలం  నీవే  ప్రభో  

మన  ప్రశ్నలకు  జవాబులు  - తెలుపును  సాయి  చరితములు  
వినండి  లేక  చదవండి  - సాయి  సత్యము  చుడండి  
సత్సంగామును  చేయండి  - సాయి  స్వప్నము  పొందండి  
బేధ  భావమును  మానండి  - సాయి  మన  సద్గురువండి  

షిరిడి  వాస  సాయి  ప్రభో  - జగతికి  మూలం  నీవే  ప్రభో  

వందనమయ్య  పరమేశా  - ఆపాత్  భాండవ  సాయి స  
మా  పాపములు  కడతేర్చు  - మా  మది  కోరిక  నెరవేర్చు   
కరుణ  మూర్తి  ఓ  సాయి  - కరుణతో  మమ్ము   దరి  చేర్చోయి  
మా  మనస్సు  ని   మందిరము  - మా  పలుకులే  నేకు  నైవేద్యం  

షిరిడి  వాస  సాయి  ప్రభో  - జగతికి  మూలం  నీవే  ప్రభో  


శ్రీమత్  అఖిలాండ  కోటి  బ్రహ్మాండ  నాయక  రాజాది  రాజ  యోగి  రాజ  పరబ్రహ్మ  శ్రీ  సత్చితానంద  సమర్ధ   సద్గురు  షిరిడి  సాయినాథ్  మహారాజ్  కి  జై  


sri sai divya puja : click this link u will get the sri sai divya puja book